vrm media లీగల్ ఖమ్మం ప్రతినిధి రవికుమార్

ఖమ్మం లీగల్
ఖమ్మం పట్టణం నకు చెందిన
నిందితుడు బత్తుల చంద్రశేఖర్ కు మైనర్ బాలిక పై లైంగిక దాడి చేసిన కేసు లో జీవిత కాలం జైలు శిక్ష తో పాటు ఒక లక్ష ల రూపాయి ల జరిమాన విధిస్తూ ఖమ్మం జిల్లా ఫోక్స్1 ఇన్ ఛార్జ్ న్యాయాధికారి మొదటి అధనపు జిల్లా న్యాయాధికారి బి. శ్రీనివాసరావు సోమవారం
తీర్పు చెప్పారు.
ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం 6 మే 2024 నాడు మైనర్ బాలిక కు మాయమాటలు చెప్పి ఇంటి లోకి తీసుకొని పోయి నిందితుడు
మైనర్ బాలిక పై లైంగిక దాడికి పాల్పడాడని
6 మే 2024 న ఖానాపురం హవేలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసి కేసు ను విచారించి కోర్టులోచార్జెషీట్ దాఖలు చేశారు. కేసును విచారించిన న్యాయాధికారి నేరం రుజువు కావడంతో పై విధంగా తీర్పు చెప్పారు.
ప్రాసిక్యూషన్ తరపున పబ్లిక్
ప్రాసిక్యూటర్ జమ్ముల శరత్ కుమార్ రెడ్డి, లైసెనింగ్ ఆపీసర్ శ్రీనివాస్, హోమ్ గార్డు చిట్టిబాబు లు సహకరించారు.