ఒంటిమిట్టVRM న్యూస్ రిపోర్టర్ పి ఈశ్వర్ జూన్ 2
ఒంటిమిట్ట మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు పల్స్ పోలియో ప్రోగ్రాం చేస్తున్నటువంటి వైద్యాధికారులు డాక్టర్ భావన డాక్టర్ అరుణ్ జ్యోతి మరియు సిద్ధవటం సబ్ యూనిట్ అధికారి ఇండ్ల సుబ్బరాయుడు వీరి ఆధ్వర్యంలోl ఆశాడే మీటింగ్ సందర్భంగా ఈనెల 28- 6 -2026 వ తేదీన పల్స్ పోలియో ప్రోగ్రాం లో వైద్య సిబ్బంది అందరూ పాల్గొని 0 to 5 ఇయర్స్ పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయాలని తెలియపరచడం జరిగింది.అలాగే జూన్ 1 నుండి 30 వరకు మలేరియా వ్యతిరేక మాసొస్తవాలు నిర్వహించాలని మరియు మలేరియా రహిత సమాజంగా తీర్చిదిద్దాలని వైద్య సిబ్బందికి తెలియజేయడం జరిగింది.ప్రతి గ్రామ మరియు పట్టణ ప్రాంతాల్లో ఉండే ప్రజలను మలేరియాపై అవగాహన కల్పిస్తూ ఉండాలని తెలియపరిచారు.ఇంటి పరిసరాల ప్రాంతాలలో చుట్టుపక్కల నీరు నిల్వ ఉన్న ప్రదేశాలను గుర్తించి వాటిని తొలగించాలి జ్వరం వచ్చిన వెంటనే వైదధికారి సమక్షంలో రక్త పూత పరీక్షలు నిర్వహించాలని తెలియపరిచారు మరియు వ్యాధి నిర్ధారణ అయిన వెంటనే మండల సూపర్వైజర్ మగ ఆరోగ్య కార్యకర్త ద్వారా ఉచితంగా వ్యాధిగ్రస్తులకు ఇంటి దగ్గరే రాడికల్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది.అని వైద్య సిబ్బందికి తెలియజేయడం జరిగింది.ప్రతి కుటుంబం దోమతెరలలో నిద్రించాలని నిండు వస్త్రాలు ధరించాలని వేపాకు పొగ వేసుకోవాలని ప్రతి శుక్రవారం డ్రై డే ఫ్రైడే పాటించాలని తెలియపరిచారు.మరియు పరిసరాల పరిశుభ్రత వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని తెలియపరిచారు ఈ కార్యక్రమములో పీహెచ్ఎన్ వెంకటసుబ్బమ్మ సూపర్వైజర్ భాస్కర్ రెడ్డి మరియు సుజాత హెల్త్ అసిస్టెంట్ వెంకటసుబ్బయ్య సిహెచ్ వోలు ఆరోగ్య కార్యకర్తలు మరియు ఆశా కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

